నవతెలంగాణ – మాక్లూర్:
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తొమ్మిదేళ్ళ పాలనలో శిలపాలకాలకే పరిమితం అయ్యారని అభివృద్ది చేయలేదని ఓట్లు అడుగే హక్కు ఆయనకు లేదనీ ఆర్మూర్ బీజేపీ నాయకులు పైడి రాకేష్ రెడ్డి అన్నారు. మండలంలోని కొత్తపల్లి గ్రామంలో బీజేపీ ఎన్నికల ప్రచారం ఆర్మూర్ బీజేపీ నాయకుడు రాకేష్ రెడ్డి శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తొమ్మిది సంవత్సరాల్లో శిలపలాకలు వేసి పనులు మాత్రం జరుగడం లేదనీ, ఒక్క ఇల్లు కూడా కట్టించని ఎమ్మెల్యే ఓట్లు అడుగే హక్కు లేదనీ అన్నారు. కేంద్రం ఇస్తున్న పంచాయతీ నిధులతో మాత్రమే గ్రామంలో పనులు చేస్తున్నారనీ, రాష్ట్ర ప్రభుత్వం పేరుకు మాత్రమే ఉందనీ, బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని అభివృధి లో పక్షపాతం లేకుండా చేస్తామని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సురేష్ నాయక్, నియోజకవర్గ కన్వీనర్ పలేపూ రాజు, ఓబిసీ మోర్చ ఉపాధ్యక్షుడు మరంపాల్లి గంగాధర్, రవి యాదవ్తదితరులు పాల్గొన్నారు.