జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే ముచ్చటగా నాలుగో సారి బీఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికల బరిలో ఉండటంతో బాన్స్ వాడ డివిజన్ రైస్ మిల్లర్ అసోసియేషన్ సభ్యులు తమ మద్దతు ఎమ్మెల్యే హన్మంత్ షిండే కె తెలుపుతున్న ట్లు ఏక గ్రీవంగా తీర్మానం చేసి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షిండేకుమద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన స్వగృహం బిచ్కుందలో తీర్మాన కాపీని అందజేసినట్లు తెలిపారు. భారీ మెజారిటీతో హన్మంత్ షిండే ను గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అడుగుల లాక్షమాన్, అసోసియేషన్ ప్రతినిధులు ఎలెవల కృష్ణ రెడ్డి, ప్రతాప రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.