బహుజన సమాజ్ పార్టీ ని వచ్చే సాధారణ ఎన్నికల్లో ఆదరించండి

నవతెలంగాణ – హలియా: శుక్రవారం నాడు సాగర్ నియోజకవర్గం హాలియా పట్టణ కేంద్రంలో ఉన్న పార్టీ కార్యాలయం లో నియోజకవర్గ సమీక్ష సమావేశానికి నియోజకవర్గ అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఇన్చార్జ్ పోలె పల్లి రాజేష్ హాజరై మాట్లాడుతూ.. వచ్చే సాధారణ ఎన్నికలలో సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని అందుకుగాను నియోజకవర్గం లో 6 మండలాలలో ఉన్న ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ అగ్రకుల పేద ప్రజలు ప్రస్తుతం ఉన్న అగ్రకుల పార్టీ ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బత్తుల ప్రసాద్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రమావత్ రమేష్ రాథోడ్, నియోజకవర్గ సహాయ కార్యదర్శి కుక్కముడి ముత్యాలు, నియోజకవర్గ మహిళా కన్వీనర్ బైరాగి విజయ, అనుముల మండల అధ్యక్షుడు జిల్లా మధు, గుర్రంపోడు మండల అధ్యక్షుడు కొమ్ము రమేష్, సోషల్ మీడియా ఇన్చార్జ్ మామిడి నరేందర్, నిడమానూరు మండల మహిళా అధ్యక్షురాలు దుబ్బ జ్యోతి, బహుజన సింగర్ నగేష్ నాయక్, వలికి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.