మా నాన్నను ఆశీర్వదించండి

– ఎమ్మెల్యే కూతురు పైళ్ళ మాన్విత రెడ్డి 
నవతెలంగాణ – భువనగిరి
 మా నాన్న భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని పట్టణ ప్రజలు ఆశీర్వదించాలని కోరుతూ ఎమ్మెల్యే కూతురు పైళ్ళ మాన్విత రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం పట్టణంలోని అర్బన్ కాలనీ శ్రీరామ్ నగర్ కాలనీలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భువనగిరి అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి చేసిన పనులను చూసి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, స్థానిక కౌన్సిలర్ చెన్న  స్వాతి, మహేష్ పట్టణ పార్టీ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్ నాయకులు గాదె శ్రీనివాస్,  ప్రధానకార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, రాచమల్ల రమేష్, గోమారి సుధాకర్ రెడ్డి, పెంట నితీష్, నాగారం సూరజ్, నాకోటి నగేష్, ఇండ్ల శ్రీను, మోత్కుపల్లి శివ, అజయ్, బచ్చు శ్రవణ్, రాజేష్, పాల్గొన్నారు.