గాదరి కిషోర్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి

నవతెలంగాణ-తిరుమలగిరి : తిరుమలగిరి మండలం తొండ, మర్రికుంట తండా, చింతల కుంట తండా  గ్రామపంచాయతీలలో శుక్రవారం బూత్ కమిటీ సమావేశం నిర్వహించి నవంబర్ 30 తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో  తుంగతుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డా.గాదరి కిశోర్ కుమార్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరి ఈ నెల 29వ తేదీన తిరుమలగిరి మండల కేంద్రంలో జరుగనున్న సీఎం కెసీఆర్ గారి సభకు భారీగా తరలిరావాలని తిరుమలగిరి మాజీ ఎం.పీ.పీ కొమ్మినేని సతీష్ కుమార్  కోరారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి టిఆర్ఎస్  మండల పార్టీ అధ్యక్షుడు సంకేపల్లీ రఘు నందన్ రెడ్డీ , ఎంపీపీ  నేమరుగొమ్ముల స్నేహాలత ,తొండ సర్పంచ్ శాతవాహన రావు మండల నాయకులు దూపటి  రవి, వేణుగోపాల్ రెడ్డి, బత్తుల శ్రీను, తెడ్డు భాస్కర్,పొన్నం వెంకన్న, సికిందర్ ,బానోత్ రవి,రాములు నాయక్,మంగు,గోపాలరెడ్డి, రామాంజనేయులు, యాకూబ్ నాయక్,కో ఆప్షన్ మెంబర్ మౌలానా, చారి ఆయా గ్రామ సర్పంచ్ లు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.