నవతెలంగాణ-భువనగిరి రూరల్
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నుండి రాష్ట్ర ఎన్నికల అడిషనల్ సెక్రెటరీ లోకేష్ కుమార్ ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల సిబ్బందికి విధుల కేటాయింపు, శిక్షణ తరగతులు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా సిబ్బందికి విధులు, కేటాయించిన ప్రదేశాలు సూచించాలని, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు మాస్టర్ ట్రైనర్లతో శిక్షణా తరగతులు నిర్వహించాలని, ఎన్నికల విధులకు సంబంధించి సిబ్బందిని అదనంగా సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ హనుమంతు కె జెండగే, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ ఏ.భాస్కరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి జగన్ పాల్గొన్నారు.