ముగిసిన ఈవీఎంల ర్యాండమైజేషన్‌ ప్రక్రియ

– కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్‌
జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు , రిటర్నింగ్‌ అధికారులు, సంబంధిత ఎన్నికల విభాగం సిబ్బంది సమక్షంలో పూర్తి ఆన్లైన్‌ విధానం ద్వారా బ్యాలెట్‌ యూనిట్‌,కంట్రోల్‌ యూనిట్‌, వివి ప్యాట్స్‌ ల కేటాయింపు (ర్యాండమై జేషన్‌ ప్రక్రియ) పూర్తి అయ్యిందని కలెక్టర్‌ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్స్‌ (ఈ.వి.ఎం) బ్యాలెట్‌ యూనిట్స్‌, కంట్రోల్‌ యూనిట్స్‌, వివిప్యాట్స్‌, కేటాయింపు ప్రక్రియ పూర్తి చేశామని నేడు ఉదయం నల్గొండ,మిర్యాలగూడ,దేవరకొండ,నకిరేకల్‌,నాగార్జున సాగర్‌,మును గోడ్‌ నియోజకవర్గాల పరిధిలోని స్ట్రాంగ్‌ రూములకు పోలీస్‌ భద్రత మధ్య తరలించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ప్రతి నియోజకవర్గ కేంద్ర పరిధిలో ప్రత్యేక హెల్ప్‌ డేస్‌ లు ఏర్పాటు చేయడం జరిగిందని, టోల్‌ ఫ్రీ (1950) లకు ఎన్నికలకు సంబంధించి ఏదైనా సమస్యలు, ఫిర్యాదులు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరు నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు (స్థానిక అదనపు కలెక్టర్‌) హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌,అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) జె.శ్రీనివాస్‌, రవి ,శ్రీ రాములు, చెన్నయ్య,దామోదర రావు, సీపీఐ(ఎం) నుండి నర్సిరెడ్డి, బీఆర్‌ఎస నుండ్‌ి పిచ్చయ్య, బిఎస్పి నుండి వి.యాద గిరి, టిడిపి నుండి మల్లి జార్జున్‌,ఎంఐఎం నుండి షేక్‌ మెయిన్‌,కాంగ్రెస్‌ నుండి అశోక్‌,బి జె పి నుండి లింగ స్వామి, ఎన్నికల డిటి.విజరు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.