నవతెలంగాణ – సత్తుపల్లి రూరల్
సత్తుపల్లి మండలం బి గంగారం 15 బెటాలియన్ నందు శనివారం పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుక ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పటాలపు కమాండెంట్ పి.వెంకట్ రాములు పాల్గొని వీధి నిర్వహణలో అశువులుబాసిన వారికి పులమాలవేసి నివాళులు అర్పించారు. స్మృతి పరేడ్ ద్వారా పోలీసు అమర వీరులకు గౌరవవందనని సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ విభాగాలలో విధులు నిర్వహిస్తు దేశంకోసం, సమాజంకోసం అమరులైన వారిని స్మరిస్తూ అక్టోబర్-21 న ఘనంగా ఈ వేడుకలు నిర్వహించడం వారికి నివాళులు అర్పించడం ఎంతో గొప్ప కార్యక్రమని ఆయన తెలియజేశారు.అదేవిదంగా సంఘ విద్రోహులను ఎదుర్కొనేందుకు వారినుండి సమాజాన్ని కాపాడేందుకు పోలీసులు ఎప్పుడు సిద్దంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమానికి పటలపు సహాయ దళాధిపతులు యం ఉదయ్ భాస్కర్ రావు , ఆర్ నాగేశ్వర రావు గారు, యం శ్రీనివాసరావు, ఆర్.ఐ లు, ఆర్.ఎస్.ఐ లు పటాలపు ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.