
రెంజల్ మండలం బోర్గాం, తాడు బిలోలి గ్రామాలలోని యువత బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ కండువను ధరించారు. ఈ సందర్భంగా రెంజల్ మండలంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ రెంజల్ మండలంలో షకీల్ ఆమీర్ గెలుపు కోసం తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామని వారు స్పష్టం చేశారు.