ప్రజా స్వామ్యం లో పోలీసుల కీలకపాత్ర..

– కలెక్టర్ అనురాగ్ జయంతి
నవతెలంగాణ -చందుర్తి
ప్రజాస్వామ్యంలో పోలీసుల కీలక పాత్ర ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి అన్నారు. శనివారం ఆయన లింగంపేట గ్రామంలోని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద ఎస్పి అఖిల్ మహాజన్ తో కలిసి అమరవీరులకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1959 చైనాలోని లడకి లో జరిగిన కటనలో పోలీసులు అమరులయ్యారు అందుకు అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల దినోత్సవం గా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు ప్రజారక్షణలో అసువులు బాసిన పోలీసుల త్యాగాలు మరువలేనివని అన్నారు పోలీస్ వృత్తి ఎంతో గర్వించదగిందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య డిఎస్పీలు నాగేంద్ర చారి, రవి కుమార్, సి ఐలు కిరన్ కుమార్, కృష్ణ కుమార్, సదన్ కుమార్, ఉపేందర్, శశిధర్ రెడ్డి, అన్ని మండలాల ఎస్సైలు పాల్గొన్నారు.