– బెటాలియన్ కమాండెంట్ రంప్రకాష్..
నవతెలంగాణ- డిచ్ పల్లి
పోలీసు వారి విధినిర్వహణ ఎంతో భాద్యతాయుతమైనదని, నీతి, నిజాయతీ, సాహసం పోలీస్ గుండెల్లో విలీనం అవుతాయని, దేశానికి వెన్నెముకలా “పోలీసు” పిలువబడుతుందని, దేశ రక్షణ – ప్రజా రక్షణ కోసం గడియారములోని ముల్లులా రేయింబవళ్ళు శ్రమిస్తూ, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవరోధములు ఏర్పడిన, ప్రాణాలను పణంగా పెట్టి భాద్యతాయుతంగా నిస్వార్ధముగా విధులు నిర్వహిస్తు సంఘ విద్రోహుల దుశ్చర్యల మూలంగా తమ అమూల్యమైన నిండు నూరేళ్ల జీవితాన్ని దేశ రక్షణకై ప్రజా రక్షణకై అంకితము చేస్తున్నామని ఏడవ బెటాలియన్ కమాండెంట్ బి రంప్రకాష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ 7వ బెటాలియన్ డిచ్ పల్లి లో శనివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకోని కమాండెంట్ బి. రాంప్రకాష్ అద్వర్యంలో బెటాలియన్ ఆవరణంలో గల పోలీస్ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్చంతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమాండెంట్ మాట్లడుతూ అక్టోబర్ 21 యావత్తు భారత దేశమంతట పోలీస్ బలగాలు అమర పోలీసులు సంస్మరణ దినముగా పాటిస్తారని వారి సాహసోపేతమైన చర్యల్ని మాటల్లో వర్ణించలేమని,వారి సేవలు ఆనన్య సామాన్యమన్నారు. 1959 అక్టోబర్ 21 న దేశానికి చెందిన 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు జమ్ము కాశ్మీర్ లోని “లడక్” ప్రాంతంలోని “హాట్ స్ప్రింగ్” నుండి చైనా చొరబాట్లు జరిగినప్పుడు, అ చొర బాట్లను అరికట్టడానికి, చైనా ఆర్మీతో సిఅర్పిఎఫ్ కు చెందిన 10 మంది జవాన్లు 14 గంటల పాటు, దేశ రక్షణ కోసం రాజీలేని పోరాటం చేసి ఆమరులైనారని పేర్కొన్నారు. రాజ్యాంగ రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, సమాజ శ్రేయస్సులకై అహర్నిశలూ, కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉగ్రవాద, తీవ్రవాద చర్యల్ని ఎదుర్కోంటు, సంఘ విద్రోహ శక్తుల నుంచి పౌరుల ధన, మాన, ప్రాణ, రక్షణ కోసం పోరాటం చేస్తూ ప్రతి సంహ ఏటా గ్రామంలో అమరులైన పోలీసు వీరుల అమరత్వానికి చిహ్నంగా, అక్టోబర్ 21 వ “అమరపోలీసుల సంస్మరణ” దినంగా పాటిస్తున్నామన్నారు. ఈ సందర్భముగా అమరులైన పోలీసు వీరులకు, బెటాలియన్ తరుపున జోహార్లు అర్పించారు. 01-09-హ నుండి 31-08 వరకు మన భారతదేశమంతట అసాంఘిక శక్తుల చర్యల వల్ల, విధి నిర్వహణలో (189) మంది పోలీసులు అమరులయ్యారు. ఇక పోతే, తీవ్రవాదుల దుశ్చర్యల మూలంగా 7వ బెటాలియన్ కు చెందిన (11) మంది పోలీసు సిబ్బంది బినేశ్వరరావు దేవిదాస్ అర్ సుకన్య ,బాబా అలీ, కురాన్ రసూల్ సుభాష్ చంద్రబోస్, యేసయ్య, హేమంత్ కుమార్, జవహార్ లాల్, మారుతిరావు,జె వాసు, కే వేణు, బెటాలియన్ కు చెందిన అమరులైన పోలీసు సిబ్బంది ఆత్మలకు శాంతి కలగజేయాలని భగవంతుని ప్రార్థిస్తు వారి కుటుంబ సభ్యులకు బెటాలియన్ తరుపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆదుకుంటామని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ఎళ్ళవేళలా
అండగా ఉంటావని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమాండెంట్స్ యం. వేంకటేశ్వర్లు, యస్. విష్ణుమూర్తి, కె. బాస్కర్ రావు, సి. ఆంజనేయ రెడ్డి, యూనిట్ మెడికల్ ఆఫీసర్ శ్రీమతి యన్. అనుపమా, ఎఓ సి. హంసరాణి, ఆర్ ఐలు పి. వేంకటేశ్వర్లు, యం. నరేష్, కె. శ్యామ్ రావ్, ఆర్. ప్రహల్లాద్, ఆర్.యస్.ఐ లు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.