విద్యుత్ ట్రాన్స్ఫారంతో పోంచి ఉన్న ప్రమాదం

నవతెలంగాణ- బొమ్మలరామారం 

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో విద్యుత్ ట్రాన్స్ఫారం వల్ల ప్రమాదవ పొంచి ఉన్న సంఘటన మండల మైసిరెడ్డిపల్లి గ్రామ చివరిలో ఉన్నటువంటి ట్రాన్స్ఫారంకు రక్షణ వలయాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. పశువులు ఎక్కడ వెళ్లి ట్రాన్స్ఫారంకు తలుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దానితో పాటు సామాన్యులు ,పిల్లలు అందుకున్న అంత ఎత్తులోనే వుండటం వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని సంబంధిత అధికారులు స్పందించి వెంటనే ట్రాన్స్ఫారాన్ని తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు.