భువనగిరిలోని ఎఫ్ ఎల్ ఎన్ ఎస్ డిగ్రీ కళాశాల మైదానం లో జిపిఆర్, సి ఆర్ ఇన్ఫ్రా డెవలప్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన మొదటి విజేత టీం వారికి 50వేల రూపాయలు రెండవ బహుమతి కింగ్స్ 11 టీం వారికి 25వేల రూపాయలు మాన్ అఫ్ ది సిరీస్ బెస్ట్ బౌలర్ బౌలర్ గారికి3000 రూపాయల చొప్పున భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బహుమతులు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యువత చెడు మార్గంలో పయనించకుండా ఆటలపై దృష్టి సారించాలన్నారు. క్రీడలు ఒక వ్యక్తి యొక్క నైపుణ్యాన్ని బయటకు తీస్తాయని. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు మరింత ప్రాధాన్యతమిస్తుందన్నారు. భువనగిరి నియోజకవర్గం లో యువతకు క్రీడలకు ఎప్పుడు నా సహకారం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు బీబీనగర్ జెడ్పిటిసి గోలి ప్రణీత పింగళి రెడ్డి, పులిగిల్ల సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి, మద్ది వెంకట నరసింహ రెడ్డి, ఆర్గనైజర్స్ కోళ్ల గంగాధర్, ఊదరి సతీష్ యాదవ్, ఆబోతుల కేతన్, ఊపిరి చేతన్ రెడ్డి, పెంట నితీష్ పాల్గొన్నారు.