బట్టల షాపుల్లో ఉయ్యాలో…

తెలంగాణలో దసరా పండుగ సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎంగిలి పూల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ, దసరా పండుగ ఇలా పదకొండు రోజు లుగా పండుగ జరుపుకుంటున్నారు. ఈ పండుగను ప్రజలు ఎంత సంతోషంగా జరుపుకుంటారో, వ్యాపార సంస్థలు అంతే సద్వినియోగం చేసుకుంటున్నాయి. దసరా పండుగ సందర్భంగా బంగారు దుకాణాలు, బట్టల షాపులు ఎన్నో ఆఫర్లు ఇస్తున్నాయి. ఒక్కటి కొంటే ఇంకొకటి ఉచితం. సరసమైన ధరలకే కిలోల చొప్పున బట్టలు ఇస్తున్నాం… కొనండి…ఇలా అనేక రకాలుగా ఆఫర్లు ఇచ్చి వినియోగ దారులను ఆకర్షిస్తున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు నగలు, బట్టల దుకా ణాలు ఎంతో ఆకర్షణీయంగా అలంకరించారు. దసరా పండుగను ప్రతిబింబించేలా బతుకమ్మ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజు బంతిపువ్వులతో అలకరిస్తున్నారు. ఆయా దుకాణాల్లో పెద్దపెద్ద సౌండ్‌ బాక్సులు ఏర్పాటు పండుగ పాటలతో మోగి స్తున్నారు. ముఖ్యంగా మహిళలు అమితంగా ఇష్టపడే బతుకమ్మకు సంబంధించిన ఉయ్యాలో… ఉయ్యాలో పాటలతో హోరెత్తిస్తున్నారు. వినసొంపైనా పాటలతో వినియోగదారులను ఆకర్షించడంతో తమ వ్యాపారాలు మూడు పూలు… ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నాయి.
– గుడిగ రఘు