రానున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

– మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌
నవతెలంగాణ-బంట్వారం
మండల కేంద్రంలోని పంక్షన్‌ హల్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో భాగంగా వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. శనివారం ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వమే వస్తుందని అన్నారు. సభలో 6 గ్యారంటీ పథకాల గురించి వివరిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాటిని అమలు పరుస్తామని తెలిపారు. అనంతరం కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు వెంకటేశం ఆధ్యర్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి మాజీ జడ్పీటీసీ సునీత శివకుమార్‌, స్థానిక సర్పంచ్‌ లావణ్య శ్రీనివాస్‌, సుల్తాన్‌ పూర్‌ సర్పంచ్‌ నర్సింలు , బంట్వారం వార్డు మెంబర్‌ లక్ష్మి ,తదితరులను కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.