ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

నవ తెలంగాణ: భూదాన్ పోచంపల్లి
తెలంగాణ సంస్కృతి  సాంప్రదాయాల్లో భాగంగా  పూలను పూజించి  పకృతిని ప్రేమించే   గొప్ప పండుగ మన బతుకమ్మ పండుగ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె స్ఫూర్తి రెడ్డి  అన్నారు. ఆదివారం పురపాలక కేంద్రంలో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఈ సందర్భంగా మాట్లాడుతూ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో  ఎంగిలిపూల బతుకమ్మ ప్రారంభమై తొమిది రోజులపాటు బతుకమ్మ సంబరాలు నిర్వహించి  సద్దుల బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని చాటి చెప్పే తీరొక్క రంగులతో తీరొక్క పువ్వులతో జరిగే బతుకమ్మ పండుగ సంబురాలను అంబరాన్ని అంటే విధంగా తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఉత్సవాలతో బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ విజయలక్ష్మి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.11వ వార్డులో కౌన్సిలర్ కుడికాల అఖిల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తడక వెంకటేశం, గుని గంటి వెంకటేశం, రమేష్, భారత లవ్ కుమార్, వెంకటేశం, ఆదర్శ యూత్ సభ్యులుపాల్గొన్నారు.