దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు చేసిన మాజీ సర్పంచ్ దంపతులు

నవతెలంగాణ – బొమ్మలరామారం
దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు బొమ్మలరామారం  మండలంలోని మర్యాల గ్రామంలో మాజీ సర్పంచ్ చీర సత్యనారాయణ దంపతులు గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన దేవీ నవరాత్రులు ఉత్సవాలు భాగంగా ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు మహిషాసురవర్ధిని దేవిగా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చీరాల విక్రాంత్ రెడ్డి, ఈదులకంటి సురేందర్ రెడ్డి, గంగిశెట్టి చంద్రశేఖర్ గుప్తా,గట్టు శ్రీహరి,మిట్టు,నాగరాజు గుప్తా, నవీన్ రెడ్డి, మల్లికార్జున్, రాజిరెడ్డి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.