లక్నవరంలో పర్యాటకుల సందడి…

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పర్యాటక కేంద్రమైన లక్నవరంలో ఆదివారం పర్యాటకులు పెద్ద సంఖ్యలో సందడి చేశారు. దసరా పండుగ కావడం సెలవు రోజులు కావడంతో పర్యాటక కేంద్రానికి పర్యాటకులు అధికంగా పోటెత్తారు. హైదరాబాదు నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు పర్యటక కేంద్రంలో ప్రకృతి అందాలను వీక్షించారు. పండగ సెలవులు ముగిసే వరకు పర్యాటకుల తాకిడి ఇలాగే ఉంటుందని పర్యాటక కేంద్రం మేనేజర్ శంకర్ అన్నారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు పర్యాటకశాఖ కృషి చేస్తుందని అన్నారు. లక్నవరం చెరువులో నీరు సమృద్ధిగా ఉన్నంతవరకు పర్యాటకులు వస్తూనే ఉంటారని పర్యాటకులకు మరింత వినోదం కల్పించేందుకు పర్యాటకశాఖ ప్రయత్నిస్తుందన్నారు. వీకెండ్ రోజులలో చక్కటి ఆహ్లాద ప్రదేశంగా లక్నవరం పర్యాటక కేంద్రం ప్రసిద్ధి చెందిందని పర్యాటకులు పేర్కొంటున్నారు. ప్రకృతి అందాల నడుమ ఏ నిర్మాణం అత్యంత సుమధురం అని అంటున్నారు.