17న బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ పార్టీ కీలక సమావేశాన్ని మే 17న (బుధవారం) నిర్వహించనున్నది. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ శాసన సభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సమావేశం కానున్నాయి. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరు కానున్నారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను పార్టీ శ్రేణులు ఘనంగా జరిపేలా.. ఆ సమావేశంలో కేసీఆర్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై చర్చించే అవకాశం ఉంది. నవంబర్‌ లేదా డిసెంబర్‌ నెలలో ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉన్నందున ఎన్నికల రోడ్‌ మ్యాప్‌పై చర్చించవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.