కార్తిక్ రత్నం , సుప్యర్ద సింగ్ జంటగా నటించిన చిత్రం ‘లింగోచ్చా’. ఆనంద్ బడాని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీకాల ఎంటర్టై న్మెంట్స్ బ్యానర్లో యాదగిరి రాజు నిర్మించారు. ఈనెల 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు.’గేమ్ ఆఫ్ లవ్ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. హైదరాబాద్‌కి సంబంధించిన రొమాంటిక్ కామెడీ విత్ లవ్‌తో ఈ కథ నడుస్తుంది. కార్తిక్ రత్నంలో ఉన్న స్టార్ యాక్టర్‌ని చూడబో తున్నారు. సినిమా హిట్ ఖాయం’ అని దర్శక, నిర్మాతలు చెప్పారు.