సభ స్థలంలో పరిశీలించిన జిల్లా కలెక్టర్…

– సభ ముగింపు వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలి..

– సభా ప్రాంగణంలో ప్రతిష్టమైన నిఘా ఏర్పాటను ఉంచాలన ఇంటలిజెన్సీ ఎస్పీ గంజి కవిత..
నవతెలంగాణ- మునుగోడు
రేపు మునుగోడు మండలంలో జరగబోయే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు చేపడుతున్న ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ , జిల్లా ఎస్పీ కె అపూర్వరావ్ పరిశీలించారు. హెలికాప్టర్ కోసం ఏర్పాటు చేసిన హెల్పడ్ స్థలమును , సభ స్థలంతో పాటు పార్కింగ్ స్థలాలను పరిశీలించారు . భద్రత ఏర్పాట్లను పరిశీలించి. తదనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు . సభ ముగింపు వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు . ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పార్కింగ్ స్థలాలలో వాహనాలను నిలుపుకునే విధంగా బంధ బస్సు నిర్వహించాలని అధికారులకు సూచించారు . శాంతి భద్రతల విషయంలో ఇంటలిజెన్సీ ఎస్పీ గంజి కవిత సభ ప్రాంగణం వద్ద ఆరా తీశారు . సభా ప్రాంగణంలో ప్రతిష్టమైన నిఘా ఏర్పాటను ఉంచాలని తమ అధికారులకు సూచించారు . వారి వెంట డిఎస్పి శ్రీధర్ రెడ్డి , రెవిన్యూ అధికారులు ,  సిఐలు , ఎస్ఐలు , అగ్నిమాపక దళ అధికారులు , విద్యుత్ అధికారులు , ఆర్ అండ్ బి అధికారులు ఉన్నారు.