
మండలం లోని కుంకుడు చెట్టు తండాలో గిరిజనులు దసరాఉత్సవాలలో భాగంగా బుధవారం తుల్జా భవాని పండుగ ఘనంగా జరుపుకొన్నారు. తమ ఆరాధ్య దైవమైన తుల్జా భవానీ మాతను దర్శించు కోవ డానికి మహారాష్ట్ర లోని తుల్జాపూర్‌కు వెళ్లి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లిం చుకున్నారు. అనంతరం తండాకు వచ్చి పండుగ సంబురాలను ఆనందో త్సహాల మధ్య జరుపుకొన్నారు. గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను ఈ ఉత్సవాలు ప్రతిబింబిస్తాయని తండా పెద్దలు రమావత్ చందునాయక్ తెలిపారు ఈకార్యక్రమంలో రమావత్ ప్రేమ్ చంద్, పద్మశ్రీ, రమావత్ అరుణ, డాక్టర్ శ్రీను పాల్గొన్నారు.