కడ్తాల్ మండలంలోని మైసిగండి గ్రామంలో బుధవారం సీఐ శివ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు కవాతు నిర్వహించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో కవాతు నిర్వహించినట్టు ఆయన తెలిపారు. ఎస్ఐ హరిశంకర్ గౌడ్ నేతృత్వంలో జరిగిన ఈకార్యక్రమంలో స్థానిక పోలీసులతో పాటు సాయుధ దళం పోలీసులు పాల్గొన్నారు.