నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్‌గా డాక్టర్ పీవీఎస్ రెడ్డి నియమితులయ్యారు. ఇండియన్ పోస్టల్ సర్వీస్ 1993 బ్యాచ్‌కు చెందిన ఆయన ప్రస్తుతం ఇదే సర్కిల్‌లో పోస్‌మాస్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. పదోన్నతిపై చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ అయినట్టు ఆ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్‌ఎస్‌ఎస్ రామకృష్ణ బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. డాక్టర్ పీవీఎస్ రెడ్డి దేశంలోని పలు ప్రాంతాల్లో వివిధ హౌదాల్లో పనిచేశారనీ, పోస్టల్ శాఖలో అనేక వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేశారని వివరించారు.