అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ ద్యేయం

– ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చెయ్యాలి
– డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి
నవతెలంగాణ – నసురుల్లాబాద్:
బీఆర్ఎస్‌కు కార్యకర్తలే పట్టుగొమ్మలని, ఎన్నికల్లో ప్రతి కార్యకర్తా ఒక సైనికుడిలా పనిచేయాలని, అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ ద్యేయం అని ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పార్టీ నేత పోచారం సురేందర్ రెడ్డిలు అన్నారు.  గురువారం బీర్కూర్ మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘంలో మండల స్థాయి ప్రజాప్రతినిధుల, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నేత సురేందర్ రెడ్డిలు  మాట్లాడుతూ ఈ నెల 30న బాన్సువాడ పట్టణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాక సందర్భంగా బాన్సువాడ లో నిర్వహించే ఆశీర్వాద  సభను విజయవంతం చేయాలన్నారు. పార్టీ బాన్సువాడ నియోజకవర్గ అభ్యర్థి, రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి  సూచన మేరకు ప్రతి ఒక్క  కార్యకర్త 35 రోజులు పార్టీ సైనికుడిలాగా పనిచేసి భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా పని చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ తెలంగాణ లో అమలు చేస్తున్న అభివృద్ది,సంక్షేమ పథకాల వైపు అన్ని రాష్ట్రాలు ఎలా అయితే చూస్తున్నాయో మన నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో ఆదర్శంగా అభివృద్ధి చేశారని, బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం  10 వేల కోట్ల ఖర్చు చేసి రాష్ట్రంలోనే అభివృద్ధిలో నెంబర్ వన్ దిశగా తీసుకువెళ్ళారాని తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించడంలో గానీ, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్లు, సీసీ రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించిన   ఘనత స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిదే అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి మాయ మాటలు చెపుతారు, పక్క రాష్ట్రం కర్ణాటకలో గెలవడానికి ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు చేతులెత్తేశారు, కర్ణాటక రైతులు మేము కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయాము మీరు నమ్మకండి అంటు ధర్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లు రైతు బందు, దళిత బందు ఆపివేయాలని ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాసి అక్కసును వెళ్లగక్కారని అన్నారు. కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికి దీమా,  మహిళలు అందరికీ నెలకు రూ. 3000 గౌరవ భృతి, మహిళా డ్వాక్రా సంఘాలకు స్వంత భవనాలు, రైతుబంధు రూ. 16,000 కు పెంపుదల. రేషన్ కార్డులపై సన్న బియ్యం పంపిణీ. గృహలక్ష్మి ఇళ్ళ మంజూరుతో పాటుగా స్వంత స్థలం లేని పేదలకు ఇళ్ళ స్థలాలు మంజూరు. పౌరులందరికి రూ. 15 లక్షలతో కేసీఆర్  ఆరోగ్య రక్ష. ప్రజలు కోరుకుంటున్నట్లు అసైన్డ్ భూములపై రైతులకు హక్కులు ఇచ్చి అమ్మకానికి, కొనడానికి మార్పు. మేనిఫెస్టో  కరపత్రం ప్రతి ఇంటికి చేరాలి ప్రతి ఒక్క  బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఒక సైనికుని వలె పనిచేస్తూ మన పోచారం శ్రీనివాస్ రెడ్డి ని  భారీ మెజారిటీతో గెలిపించుకుందాం అభివృద్ధిని కొనసాగిద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో  మాజీ జడ్పిటిసి  ద్రోణావల్లి సతీష్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డి అశోక్, ఎంపిపి రఘు, జడ్పిటిసి స్వరూప శ్రీనివాస్, యువజన నేత శశికాంత్, అవారి గంగారాం, సర్పంచ్ లు ఎంపిటిసి సభ్యులు కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు.