
నవతెలంగాణ- వేములవాడ : దాతల సహకారంతో గత 910 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమములో భాగంగా గురువారం లక్ష్మీగణపతి కాంప్లెక్స్ ముందు, భీమేశ్వర, రాజన్న ఆలయం వద్ద ఉన్న అన్నార్తులకు అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు తెలియజేశారు. నేటి అన్నదాతలుగా డాక్టర్. జువ్వాడి వెంకటేశ్వరరావు, ప్రతాప సంపత్, నగుబోతు రవీందర్ తదితరులు ఉన్నారు. అన్నదాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మధు మహేష్, నాగుల చంద్రశేఖర్, తాళ్లపల్లి ప్రశాంత్, చల్లా సత్తయ్య, నక్క వేణు, వీరగొని ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.