అక్రమంగా మద్యం నిల్వచేసి విక్రయిస్తున్న వ్యక్తి  కేసు నమోదు

నవ తెలంగాణ-గోవిందరావుపేట :
మండల కేంద్రంలో అక్రమంగా మద్యం విలువ చేసి విక్రయిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేయడం జరిగిందని పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఎస్.కె మస్తాన్ తెలిపారు. గురువారం ఎస్సై షేక్ మస్తాన్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మండల కేంద్రంలో సిబ్బందితో  కలిసి తనకి నిర్వహిస్తున్న క్రమంలో ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మద్యం నిల్వచేసి విక్రయిస్తూ ఒక మహిళ పట్టుబడడం జరిగిందన్నారు. మద్యం ను సీజ్ చేసి సదరు మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండల కేంద్రానికి చెందిన శనిగరపు లావణ్య నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా 3250 విలువైన మధ్యాన్ని కలిగి ఉండి విక్రయిస్తున్న క్రమంలో పట్టుకోవడం జరిగిందన్నారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మద్యాన్ని నిర్వహించి ఉన్నాను, విక్రయించినను చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. ఎవరైనా అక్రమంగా మద్యాన్ని కలిగి ఉండి విక్రయిస్తున్నట్లయితే తమకు సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతామని అన్నారు.