నవతెలంగాణ – హైదరాబాద్
భారతదేశంలోని ప్రముఖ వినియోగదారు ఉపకరణాల బ్రాండ్, బజాజ్- పరిశ్రమలో మొట్టమొదటి ‘మిలిటరీ గ్రేడ్ జార్స్’ని కలిగి ఉన్న కొత్త శ్రేణి మిక్సర్ గ్రైండర్లను పరిచయం చేసింది. ‘అజేయమైన దృఢత్వం’తో వర్ణించబడిన మిలిటరీ గ్రేడ్ జార్‌లు వంటగది ప్రమాదాలు మరియు పడిపోవటం వల్ల కలిగే చొట్టలు లేదా ఇతర నష్టాలని తట్టుకునేలా రూపొందించబడ్డాయి. దీర్ఘకాలంగా వినియోగదారులకు వున్న ఆందోళనను పరిష్కరిస్తూ, బజాజ్ ఇప్పుడు పరిశ్రమలో మొట్ట మొదటి మరియు విలక్షణమైన మిక్సర్ గ్రైండర్ల శ్రేణిని ఆవిష్కరించింది. ఈ ‘మిలిటరీ గ్రేడ్’ జార్ లు కఠినమైన పరీక్షలకు మరియు సమగ్ర అంచనాలకు లోబడి ఉంటాయి మరియు కఠినమైన పరీక్షల కోసం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన MIL-STD 810H సైనిక ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ప్రమాదవశాత్తు పడిపోయినప్పటికీ నష్టం లేకుండనట్లు హ్యాండిల్స్ మరియు మూతలు కూడా బలోపేతం చేయబడ్డాయి, తద్వారా దీర్ఘాయువు మరియు స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తాయి. ఇవి వినియోగదారులకు అవాంతరాలు లేని మరియు దీర్ఘకాలిక వినియోగాన్ని అందిస్తాయి. ఈ ఉత్పత్తులు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆవిష్కరణ పై బజాజ్ ఎలక్ట్రికల్ లిమిటెడ్- కన్స్యూమర్ ప్రొడక్ట్స్ బిజినెస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) రవీంద్ర సింగ్ నేగి మాట్లాడుతూ, “బజాజ్ యొక్క నూతన శ్రేణి మిక్సర్ గ్రైండర్లు పరిశ్రమ లో మొట్ట మొదటి ‘మిలిటరీ గ్రేడ్ జార్స్’ గా రూపొందించబడ్డాయి. ఇవి మా వినియోగదారులకు మన్నికైన గృహోపకరణాలను అందించడంలో మా ‘బిల్ట్ ఫర్ లైఫ్’ వాగ్దానానికి ఉదాహరణ. మిక్సర్ గ్రైండర్లు , భారతీయ వంటశాలలకు ప్రధానమైనవి, ఎక్కువగా ఉపయోగించబడతాయి అందువల్ల ఇవి త్వరగా పాడవడం , పడిపోవడం లేదా చొట్టలు పడుతుంటాయి. సొగసైన డిజైన్ మరియు అసమానమైన మన్నికతో, ఈ వినూత్న శ్రేణి మిక్సర్ గ్రైండర్లు లభిస్తాయని మేము విశ్వసిస్తున్నాము. తమ కలినరీ అనుభవాలలో శ్రేష్ఠతను కోరుకునే గృహాలకు ప్రాధాన్యత ఎంపిక అవుతుంది” అని అన్నారు. బజాజ్ మిలిటరీ సిరీస్ మిక్స్‌డ్ గ్రైండర్‌లు జీవితకాల వారంటీతో ప్రశంసలు పొందిన డ్యూరాకట్ బ్లేడ్‌లను కలిగి ఉంటాయి, కొత్త పరిశ్రమ ప్రమాణాలను నిర్దేశిస్తాయి. ఈ మిక్సర్ గ్రైండర్లు విభిన్న వాటేజ్ అంతటా మరియు ప్రకాశవంతమైన రంగులలో అందుబాటులో ఉన్నాయి, విభిన్న యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు మరియు తాజా డిజైన్ లాంగ్వేజ్‌ను అందిస్తాయి. బ్రాండ్ యొక్క ‘బిల్ట్ ఫర్ లైఫ్’ ఫిలాసఫీని పునరుద్ఘాటిస్తూ, ఆకట్టుకునే డిజిటల్ ప్రచారాన్ని కూడా బ్రాండ్ ఆవిష్కరించింది. ఈ బ్రాండ్ ఫిల్మ్ ‘మిలిటరీ గ్రేడ్ జార్స్’ యొక్క బలం మరియు స్థిరత్వంను నొక్కి చెబుతుంది, ఇది రోజువారీ గ్రైండింగ్ పనులను అప్రయత్నంగా జయించగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది – ఇది ప్రతికూల పరిస్థితి ల్లో సైతం మన సాయుధ బలగాల యొక్క సాహసోపేత స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది.