రెండవ త్రైమాసికంలో రూ.12,864 కోట్ల ఆదాయం ఆర్జించిన టెక్ మహీంద్రా

– మధ్యంతర డివిడెండ్ ఒక్కో షేరుకు రూ. 12
ముంబై: డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, కన్సల్టింగ్ మరియు బిజినెస్ రీ-ఇంజనీరింగ్ సేవలలో నిపుణుడైన టెక్ మహీంద్రా లిమిటెడ్ సెప్టెంబర్ 30, 2023తో ముగిసిన త్రైమాసికంలో ఆడిట్ చేయబడిన ఏకీకృత ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

ఈ త్రైమాసికంలో ఆర్థిక పరంగా ముఖ్యాంశాలు (USD) :

యుఎస్ డి 1,555 మిలియన్ వద్ద ఆదాయం; 2.8% గత త్రైమాసికం తో పోలిస్తే ఈ త్రైమాసికం ( QoQ)  తగ్గింది,  ఇయర్ ఆన్ ఇయర్ ఇది 5.1% తగ్గింది
– ఎబిట్డా , యుఎస్ డి 129 మిలియన్ వద్ద ఉండగా ;  గత త్రైమాసికం తో పోలిస్తే ఈ త్రైమాసికం 20.5% తగ్గింది , ఇయర్ ఆన్ ఇయర్ 47.3% తగ్గింది :  మార్జిన్ 8.3% వద్ద ఉండగా , గత త్రైమాసికం తో పోలిస్తే ఈ త్రైమాసికం 180 bps తగ్గింది
– పన్ను తర్వాత లాభం (PAT) యుఎస్ డి 59 మిలియన్లు;  గత త్రైమాసికం తో పోలిస్తే ఈ త్రైమాసికం 29.3% తగ్గింది, ఇయర్ ఆన్ ఇయర్ 62.5% తగ్గింది
– ఫ్రీ కాష్ ఫ్లో $213 మిలియన్ల వద్ద వుంది
– త్రైమాసికంలో ఆర్థిక పరంగా ముఖ్యాంశాలు (₹)
– ఆదాయం ₹ 12,864 కోట్లు;  గత త్రైమాసికం తో పోలిస్తే ఈ త్రైమాసికం 2.2% తగ్గింది,  ఇయర్ ఆన్ ఇయర్ 2.0% తగ్గింది
– ఎబిట్డా  ₹ 1,072 కోట్లు; గత త్రైమాసికం తో పోలిస్తే ఈ త్రైమాసికం 19.9%  తగ్గింది, ఇయర్ ఆన్ ఇయర్ 46.0% తగ్గింది
– ఏకీకృత పన్నుల తరువాత లాభం  ₹ 494 కోట్లు; గత త్రైమాసికం తో పోలిస్తే ఈ త్రైమాసికం 28.7%  తగ్గింది,  ఇయర్ ఆన్ ఇయర్ 61.6%  తగ్గింది

– బోర్డు మధ్యంతర డివిడెండ్ ఒక్కో షేరుకు రూ. 12 అందిస్తుంది.
ఇతర ముఖ్యాంశాలు
– మొత్తం హెడ్‌కౌంట్ 150,604  గత త్రైమాసికం తో పోలిస్తే ఈ త్రైమాసికం   2,307 పెరిగింది
– సెప్టెంబర్ 30, 2023 నాటికి INR 6,515 కోట్లకు నగదు మరియు నగదు సమానం.
టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ CP గుర్నానీ మాట్లాడుతూ, “ ఈ సంవత్సరం క్లయింట్‌లతో సన్నిహితంగా పని చేసే మా వ్యూహాన్ని మేము రెట్టింపు చేసాము, వారు తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి మరియు ఆధునీకరించడానికి సహాయపడతాము…” అని అన్నారు.
టెక్ మహీంద్రా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రోహిత్ ఆనంద్ మాట్లాడుతూ..“వ్యాపార పరంగా ప్రధానేతర ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహించటాన్ని  తగ్గించడానికి మేము చర్యలు తీసుకున్నాము. ఈ చర్యలు, కాలక్రమేణా, మా ఆర్థిక పనితీరును మెరుగుపరచడంలో మరియు  స్థిరమైన వృద్ధిని సాధించడంలో మాకు సహాయపడతాయి. స్థిరమైన డివిడెండ్ చెల్లింపు మా వాటాదారులకు విలువను సృష్టించే విషయంలో మా నిబద్ధతను బలపరుస్తుంది…” అని అన్నారు