తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘కీడా కోలా’. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ ‘కయ్యాల చిందాట’ పాటని మేకర్స్ గురువారం రిలీజ్‌చేశారు. మాస్‌ని రిడిఫైన్ చేస్తూ హై ఎనర్జీ అండ్ రేసింగ్ నెంబర్‌గా ఈ పాటను వివేక్ సాగర్ కంపోజ్ చేశారు. నిక్లేష్ సుంకోజీ అందించిన లిరిక్స్ యూనిక్ అండ్ క్యాచీగా ఉన్నాయి. హేమచంద్ర వాయిస్ పాటకు మరింత మాస్ పంచ్‌ని తీసుకొచ్చింది. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె.వివేక్ సుధాంషు, సాయికష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. నవంబర్ 3న ఈ సినిమా విడుదల కానుంది.