తెలుగు సినిమాలలో ప్రేక్షకులు ఎప్పుడూ వైవిధ్యం కోరుకుంటారు. సినిమాలో కంటెంట్ బాగుంటే అది చిన్నా-పెద్దా అనే తేడా చూప కుండా ఆ సినిమాను విశేషంగా ఆదరిస్తారు. మంచి కంటెంట్‌తో డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ ‘మహర్ యోధ్ 1818’ చిత్రాన్ని నిర్మిస్తోంది.
‘మాయపేటిక, శ్రీవల్లి’ వంటి పలు చిత్రాల్లో నటించిన హీరో రజత్ రాఘవ్, ఐశ్వర్య రాజ్ బకుని హీరోయిన్‌గా, రాజు గుడిగుంట్ల దర్శకత్వంలో సువర్ణ రాజు దాసరి నిర్మిస్తున్న సోషల్ థ్రిల్లర్, యాక్షన్, ఫాంటసీ చిత్రమిది.
ఈ చిత్ర పూజా కార్యక్రమాలు భద్రకాళీ పీఠం పీఠాదీశ్వరి శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ సింధు మాతాజీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో గురువారం ఘనంగా జరిగాయి. అలాగే షూటింగ్ కూడా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఏ.పి.యస్.సి. సెల్ కమీషనర్ విక్టర్ ప్రసాద్ హీరో, హీరోయిన్‌లపై చిత్రీకరించిన ముహూ ర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మేకర్స్ సినిమా విశేషాలను తెలిపారు. మరిన్ని వివరాలు చిత్ర బృందం త్వరలోనే ప్రకటించనుంది.
ఈ చిత్రానికి నిర్మాత : సువర్ణ రాజు దాసరి, దర్శకత్వం: రాజు గుడిగుంట్ల, సంగీతం : మహా-శశాంక్ ద్వయం, సినిమాటో గ్రాఫర్ : వెంకట్ , ఎడిటింగ్ : నందమూరి హరి.