ఓపెన్‌ హౌస్‌పై విద్యార్థులకు అవగాహన..

నవతెలంగాణ – వేములవాడ రూరల్:
పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ఆదేశాల మేరకు శుక్రవారం  ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం నిర్వహించామని రూరల్ ఎస్సై మారుతి తెలిపారు. విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం  ఎస్సై మాట్లాడుతూ ప్రజల రక్షణ, ప్రజా శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్‌ శాఖ విధి నిర్వహణ, వారు విధుల్లో ఉపయోగించే ఆయుధాలు, ఇతర పరికరాలు గూర్చి విద్యార్థులకు వివరించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా అన్ని రకాల ఆయుధాలు వాటి పనితీరును ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం ద్వారా ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు. పోలీసులు వారి విధి నిర్వహణలో ఉపయోగించే వివిధ రకాల వాహనాలు, అన్నింటిని పరిశీలించారు. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలల కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ప్రదర్శనకు ఉంచిన ఆయుధాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఏఎస్సై మల్లయ్య, సిబ్బంది వెంకటేష్, శంకర్, రాజశేఖర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.