
బాల్కొండ నియోజకవర్గం లోని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామ పరిధిలోని బుగ్గారం తాండ కు చెందిన బీఆర్ఎస్ పార్టీ మానాల గ్రామ శాఖ అధ్యక్షులు జలపతి రవీందర్, అబ్దుల్లా, రాజిరెడ్డి, పలువురు నాయకులు ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.మండల కేంద్రానికి చెందిన సిక్కు యువకులు సిరిగురు గోవింద్, దియా సింగ్, భరత్, శ్యామ్, దిలీప్ ల ఆధ్వర్యంలో 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా మండలంలోని అమీర్ నగర్ గ్రామానికి చెందిన యువకులు ఎండి అఖిల్, శివసారం నరేష్ ఆధ్వర్యంలో 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని, ముత్యాల సునీల్ కుమార్ ను గెలిపించాలని దృఢ నిశ్చయంతో ఉన్నారన్నారు. సునీల్ కుమార్ గెలుపును ఆపడం ఎవరివల్లా కాదని, ఆయన గెలుపులో భాగస్వామ్యం కావడానికి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వారు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే రాష్ట్రంలో, నియోజకవర్గంలో సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు. ప్రజలు తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. గ్రామాల్లో కార్యకర్తలు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను, మేనిఫెస్టోను వివరిస్తూ విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.