బోధన్ లో బీజేపీ జెండా ఎగర వేస్తాం

– రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి వడ్డీ మోహన్ రెడ్డి
నవ తెలంగాణ- రెంజల్:
బీజేపీ కార్యకర్తలు సైనికుల పనిచేస్తూ బోధన్ నియోజకవర్గంలో బీజేపీ జెండాను ఎగరవేయడానికి కృషి చేయాలని, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి లు స్పష్టం చేశారు. శుక్రవారం రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు, ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి తమ ధనార్జన కాపాడుకోవడానికి మాత్రమే కృషి చేశారని, నియోజకవర్గం ఏలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని దివాలా తీశారని, వారన్నారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటడంతో కటిక నిరుపేదల పరిస్థితిని దయానియంగా మారింది అన్నారు. ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ అత్యధిక మెజార్టీతో బీజేపీ అధికారంలోకి వస్తుందని, పేదల కష్టాలు తీరుతాయని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు గోపికృష్ణ, ఎంపీపీ రజని కిషోర్, బోధన్ నియోజకవర్గం బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ క్యాతం యోగేష్, మండల అధ్యక్షులు మేక సంతోష్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సంగం శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు తిరుపతి బుజ్జి, ఈర్ల రాజు, జల్ద శ్రీనివాస్, బీజే వై ఎం మండల అధ్యక్షులు ప్రకాష్, మోతిలాల్, తదితరులు పాల్గొన్నారు.