ఎమ్మెల్యే సమక్షంలో మాజీ డిసిసిబి డైరెక్టర్ బీఆర్ఎస్ పార్టీలో చేరిక

నవ తెలంగాణ- రెంజల్ :
రెంజల్ మండలం కందకుర్తి గ్రామానికి చెందిన మాజీ డిసిసిబి డైరెక్టర్ ఫెరోజ్ బేగ్, బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమీర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గత కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ వృత్తి చేసుకుంటూ ప్రజలకు సేవలు అందించారు. వారి తండ్రి బషీర్ బేగ్ తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా మండలంలో పేరు ఉంది. ఈ కార్యక్రమంలో కందకుర్తి సర్పంచ్ మీర్జా కలీం బేగ్, ఎంపీటీసీ అసద్ బేగ్, నీలా సింగిల్ విండో చైర్మన్ ఇమామ్ బేగ్, రఫిక్, అఖిల్ బేగ్, మోసిన్ బేగ్, తదితరులు పాల్గొన్నారు.