– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి
నవతెలంగాణ-మద్దిరాల
తుంగతుర్తి నియోజకవర్గంలో అధికారపార్టీ ఆగడాలను ఎదరిస్తామని, నవంబర్ 30 న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి గాదరి కిశోర్‌కుమార్‌ను ఓడిస్తామని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి అన్నారు.మద్దిరాల మండలం గోరెంట్ల గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గాదరి కిషోర్ ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామంలో దళితబంధు,గహలక్ష్మి పథకంలో ఇళ్లు ఎవరికి ఇచ్చారని ప్రశ్నించినందుకు ఆ గ్రామ సీపీఐ(ఎం) మాజీ ఎంపీటీసీ పాల్వాయి కవితపై బీఆర్‌ఎస్ అరాచక శక్తుల దాడిని ఖండించారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.నియోజకవర్గంలో దళితబంధు, బీసీబంధు,గృహలక్ష్మీ, డబుల్‌బెడ్రూం ఇళ్లు లాంటి సంక్షేమ పథకాలు ఎవరికిచ్చారని ప్రశ్నిస్తే దాడులు చేయడం దుర్మార్గమన్నారు.మండలంలో సంక్షేమ పథకాలను బీఆర్‌ఎస్ కార్యకర్తలకు తప్ప అర్హులకు ఇవ్వలేదని విమర్శించారు. గోరంట్ల గ్రామంలో సంక్షేమపథకాలు అర్హులకు ఇవ్వలేదంటూ అడిగినటువంటి గోరంట్ల మాజీ ఎంపీటీసీ పాల్వాయి కవితపై మహిళా అని చూడకుండా మూకుమ్మడిగా దాడి చేశారని విమర్శించారు.ప్రశ్నిస్తే జీర్ణించుకోలేని ఎమ్మెల్యే పోలీసుల సమక్షంలోనే దాడికి ఉసిగొలిపాడని విమర్శించారు.ఇలాంటి దాడులను ప్రజలు ,ప్రజాతంత్రవాదులు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలోఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కందాల శంకర్‌రెడ్డి, గోరంట్ల మాజీ ఎంపీటీసీ పాల్వాయి కవిత తదితరులు పాల్గొన్నారు.