గాజా దురాక్రమణ

Gaza invasion– ప్రణాళికను ఆలస్యం చేస్తున్న నేతాన్యాహు
గాజాపై దురాక్రమణ చెయ్యాలనే ఇజ్రాయిలీ సైనిక ప్రణాళికను తక్షణమే ఆమోదించటానికి ప్రధాని నేతా న్యాహు సిద్దంగా లేడని న్యూయార్క్‌ టైమ్స్‌ రాసింది. తన వార్‌ క్యాబినెట్‌ అంతా గాజా దురాక్రమణను ఆమో దించాలని ఆయన పట్టుపడుతున్నా డు.అక్టోబర్‌ 7న ఇజ్రాయిల్‌పై హమస్‌ చేసిన మెరుపు దాడి తరువాత హమస్‌ను నిర్మూలిస్తామని ఇజ్రాయిలీ నాయకత్వం ప్రతిన పూనింది. అయితే అది ఎలా, ఎప్పుడు, మొత్తంగానా లేక కొంచం కొంచం గానా అనే విషయాల పట్ల నాయకత్వానికి ఏకాభిప్రాయం లేదని టైమ్స్‌ వివిధ వనరులను ఉంటంకిస్తూ చెప్పింది. హమస్‌ దాడి తరువాత ఇజ్రాయిల్‌ 3 లక్షలా 60 వేలమంది రిజర్వ్‌ సైన్యాన్ని సమీకరిం చి గాజాపై ఎడ తెగకుండా బాంబుల వర్షం కురిపి స్తోంది. శుక్రవారంనాడే గాజా దురా క్రమణను మొదలెట్టాలనే ఇజ్రాయిల్‌ రక్షణ దళాల ప్రణాళికను నేతాన్యాహు ఆమోదించలేదని రెండు ప్రధాన వనరుల నుంచి అందిన సమా చారం ఆధారంగా న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. ఇజ్రాయిలీ జాతీయ భద్రత కు గత ఐదు దశాబ్దాలలో ఎన్నడూ ఏర్పడని ముప్పు హమస్‌ దాడితో ఏర్ప డింది. ఖతార్‌ మధ్యవర్తిత్వంతో హ మస్‌ చేతుల్లో బంధీలుగా వున్న కొంద రినైనా విడుదల చేయించవచ్చనే ఆశ వల్లనే గాజా దురాక్రమణ ఆలస్యం అవుతున్నదని కొందరు పరిశీల కులు భావిస్తున్నారు. ఇజ్రాయిలీ ప్రభుత్వం లోని కొందరు ప్రముఖులు గాజాపై పూర్తి స్థాయిలో దురాక్రమణ చేయకు ండా పరిమితంగా చేసే దాడులతో సరి పెట్టాలని భావిస్తున్నారు. గాజాపై పూర్తి స్థాయి దురాక్రమణ కష్టతరమైన పట్టణ గెరిల్లా తరహా యుద్ధానికి దారి తీయవచ్చని, అటు వంటి యుద్ధంలో లెబనాన్‌లోని హెజ్బొల్లా వంటి ప్రాంతీయ సైనిక శక్తులు పాల్గొనేం దుకు దారితీయవచ్చని కొందరు ఆందోళన చెందుతున్నారు.