రోహిత్‌ రెడ్డి గెలుపు కోసం ఎన్నికల ప్రచారం

నవతెలంగాణ-కోట్‌పల్లి
మండల కేంద్రంలో తాండూర్‌ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోట్‌ పల్లి బీఆర్‌ఎస్‌ నాయకులంతా కలిసి ఇంటింటికి ప్ర చారం నిర్వహించారని నాయకులు తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రోహిత్‌ రెడ్డి చేసిన అభివద్ధిని వివరిస్తూ ప్రజలను రోహిత్‌ రెడ్డికి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారని తెలిపారు. మత్య్సశాఖ అధ్యక్షుడు రావిరాల ఆనంద్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఉప్పరి మహేందర్‌, సీనియర్‌ నాయకులు పతం గిపాండు పాల్గొన్నారు.