– రెండవ లిస్టులో తాండూరు పేరు ఖరారు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా బియ్యని మనోహర్ రెడ్డిని పార్టీ అధి ష్టానం ప్రకటించింది. రెండవ లిస్టులో తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ టికెట్ బుయ్యని మనోహర్‌రెడ్డికి కేటాయి స్తున్నట్లు ప్రకటించడంతో తాండూరులో మనోహర్ రెడ్డి గ్రూపులో ఉత్సాహం మరింత పెరిగింది. ఇదివ రకు తాండూరు నియోజకవర్గం టికెట్టు కోసం పోటీలో ఉన్న కేఎల్‌ఆర్ తప్పుకోవ డంతో పార్టీ అధిష్టానం బుయ్యని మనోహర్ రెడ్డికి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇదివరకే తాం డూరు నియోజకవర్గంలో మనోహర్ రెడ్డి తనదైన శైలిలో పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. నియోజకవర్గంలో వివిధ కార్యక్ర మాలతో ముందుకు పోతున్నారు.