సీఎం సభకు వేలాదిగా బయలుదేరిన బీఆర్ఎస్ శ్రేణులు

– జెడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి 
నవతెలంగాణ -నెల్లికుదురు
మండలంలోని వివిధ గ్రామాలలో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు పదివేల మందికి పైగా వివిధ వాహనాలలో సీఎం సభ జిల్లా కేంద్రానికి బయలుదేరినట్లు జడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేష్ మండల ప్రధాన కార్యదర్శి వెన్నాకుల శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షుడు పులి రామచంద్రు తెలిపారు శుక్రవారం వివిధ గ్రామాల్లో వివిధ వాహనాలలో పదివేల మందిని తరలించే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని జిల్లా కేంద్రంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలకు సుమారు 50 బస్సులు 50 డీసీఎంలు 100 ట్రాక్టర్లు 500 ఆటోలలో పార్టీ శ్రేణులను తరలించామని అన్నారు రాబోయే ఎన్నికల్లో శంకర్ నాయక్ గెలుపును ఎవరు ఆపలేరని అన్నారు శంకర్ నాయక్ గెలుపుకు గ్రామాల్లో ప్రతి కార్యకర్త కృషి చేస్తారని అన్నారు ఆయన చేసిన అభివృద్ధి ఎంతగానో ఉందని అన్నారు గత పాలకులు ఈ నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు శంకర్ నాయక్ ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఈ నియోజకవర్గ అన్ని రంగాలుగా అభివృద్ధి చెందిందని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఉపసర్పంచ్లు వార్డు సభ్యులు గ్రామ శాఖ అధ్యక్షులు రైతు సమన్వయ సమితి కమిటీలు కార్యకర్తలు ఉన్నారు