నవ తెలంగాణ – సిద్దిపేట:
సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పూజల హరికృష్ణ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బరిలో నిలపనుంది. శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రెండో విడత జాబితాలో పూజల హరికృష్ణ సిద్దిపేట నుండి బరిలో నిలుస్తున్నట్లు స్థానం దక్కించుకున్నారు. విద్యార్థి దశలో ఎన్ ఎస్ యు ఐ నుండి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన పూజల ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గా కొనసాగుతున్నారు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా పదవులను చేపట్టి, వివిధ రాష్ట్రాలకు ఇన్చార్జిలుగా కూడా పనిచేశారు. సిద్దిపేట నుండి బరిలో నిలవడానికి చాలామంది కాంగ్రెస్ నాయకులు టికెట్లు ఆశించినప్పటికీ చివరికి కాంగ్రెస్ అధిష్టానం పూజల వైపే మొగ్గు చూపింది. నియోజకవర్గంలో తనకంటూ ఒక గుర్తింపును కలిగి ఉన్న పూజల హరికృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగనున్నారు.