నవతెలంగాణ-తిరుమలగిరి
అక్టోబర్ 29 ఆదివారం తిరుమలగిరిలో జరగబోయే తుంగతుర్తి సమర శంఖారావం సభకు సీఎం కేసీఆర్ విచ్చేయుచున్న సందర్భంగా తుంగతుర్తి అభివద్ధి ప్రదాత గాదరి కిషోర్‌కుమార్ పిలుపుమేరకు తిరుమలగిరి మున్సిపాలిటీలో 2వ, 3వ, 14వ వార్డులలో నాయకులు కార్యకర్తలు గడపగడపకు తిరుగుతూ సమర శంఖారావ సభను విజయవంతం చేయాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 14వ వార్డు ఇన్‌చార్జి మహేశ్వరంసందీప్ జయరాం నేత,మూడో వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మెన్ సంకేపల్లి రఘునందన్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ జిల్లా కమిటీ సభ్యులు కందుకూరి లక్ష్మయ్య, తిరుమలగిరి మాజీ మార్కెట్ చైర్మెన్ మూల అశోక్‌రెడ్డి, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి మూల వెంకటరెడ్డి, మూడో వార్డు సభ్యులు ఎర్ర గణేష్, పరమేశు, రాజు, 14వ వార్డు సభ్యులు నిర్మల యాదగిరి, జేడిదాసు, గోపాలదాసు మల్లేష్, కందుకూరి అంజయ్య, చెడె రవి, విగేష్, పత్తే పురం రవి, సునీల్, అరుణ్,మచ్చ రవి, వెంకటయ్య, రాజేష్,కందుకూరి లక్ష్మయ్య, పరుశురాములు, మహేష్, మధు, వినరు, ఆది పాల్గొన్నారు.