నాగిరెడ్డిపల్లిలో పైళ్ల వనిత శేఖర్‌రెడ్డి ప్రచారం

నవతెలంగాణ-భువనగిరిరూరల్‌
శాసనసభ ఎన్నికల్లో భాగంగా భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే సతీమణి పైళ్ల వనిత శేఖర్‌ రెడ్డి, గ్రామ సర్పంచ్‌ జక్క కవిత రాఘవేందర్‌ రెడ్డి తో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్‌ రెడ్డి అన్ని రకాలుగా అభివద్ధి చేశారని అన్నారు. భువనగిరి ఎమ్మెల్యేగా పైళ్ల శేఖర్‌ రెడ్డిని మరొకసారి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జనగాం పాండు, చందుపట్ల మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ బాల్గూరి మధుసూదన్‌ రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ అబ్బగాని వెంకట్‌ గౌడ్‌, పిన్నింటి మధు, బల్గూరు నర్మద, దేవేందర్‌, సబర్‌ కార్‌ వెంకటేష్‌ లు పాల్గొన్నారు.