సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర-2’. గౌరు గణబాబు సమర్పణలో గౌరికష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. ‘మా ఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పంపిణీదారుడు వంశీకష్ణ నంది పాటి నవంబరు 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నాయిక డా. కామాక్షి భాస్కర్ల మీడియాతో మాట్లాడుతూ, ‘మొదటి పార్ట్‌లో చాలా ఓర్పుగా ఉండే పాత్ర చేశాను. అయితే నా పాత్రకు అందులోనూ అన్ని రకాల ఎమోషన్స్ పండించే స్కోప్ ఇచ్చారు. ఇందులో ఇంకాస్త అగ్రెసివ్‌గా కనిపిస్తాను. నా పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. మంచి స్క్రీన్‌ప్లే బేస్డ్ మూవీ ఇది. సినిమా చూసి బయటికి వెళ్లే వాళ్లంతా లక్ష్మీ పాత్రను బయటికి తీసుకెళతారు. అలా అందరికీ కనెక్ట్ అవుతుంది ఇందులోని నా పాత్ర. అంతేకాదు ప్రతి 15 నిమిషాలకు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసే ఎలిమెంట్ వస్తుంది. ప్రస్తుతం ‘మాన్షన్ హౌస్ మల్లేష్’, ‘ధూత’ వంటి సినిమాలలో చేస్తున్నాను.