సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు

– పోలీసు నిఘాలో బహిరంగ సభా స్థలం
నవతెలంగాణ-ఆలేరుటౌన్‌
ఈనెల 29న ఆలేరు పట్టణంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభకి, విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున సుమారు 50 వేల వరకు ప్రజలు హాజరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి.సునీత ,ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి చైర్మెన్‌ గొంగిడి మహేదర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కమిటీ సభా విజయవంతం కోసం గత పది రోజుల నుండి చురుకుగా పనిచేస్తున్నారు.రాష్ట్ర అడిషనల్‌ సీపీ తరుణ్‌ జోషి ప్రభ స్థలాన్ని శుక్రవారం సందర్శించారు.సబ సందర్భంగా పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్త అంశాల గురించి పోలీసులకు వివరించారు.రాష్ట్ర ప్రభుత్వ విప్‌, అలేరు శాసనసభ్యురాలు గొంగిడి. సునీత మహేందర్‌ రెడ్డి, తో ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద. బిక్షమయ్యగౌడ్‌ శనివారం సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ జరిగే సభాస్థలి , హెలిప్యాడ్‌ దిగే ప్రదేశాలను స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ రైతు పక్షపాతిగా దేశంలోనే రైతులకు రైతుబంధు, రైతు బీమా లాంటి ఎవరు ఊహించని పథకాలను తీసుకొచ్చి, రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అంధకారంలో ఉంటుందన్న వారందరి నోరు మూయించి, 24 గంటల ఉచిత కరెంటు సాధ్యమని చూపించిన మహౌన్నత వ్యక్తి కెసిఆర్‌ అని, అలాంటి వ్యక్తికి ప్రతి ఒక్కరు మద్దతు పలకాలని అభిప్రాయపడ్డారు.తెలంగాణ ప్రజల కోసం అనుక్షణం ఆలోచించే కెసిఆర్‌ ని హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రిగా చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో అభివద్ధి , సంక్షేమం కొనసాగడం కోసం ,కారు గుర్తుకు ఓటు వేసి కేసిఆర్‌ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు . కేసీఆర్‌ మేనిఫెస్టో పేద ప్రజల అభివద్ధికి 100% దోహదపడుతుందని అన్నారు.కాంగ్రెస్‌ మోసపూరిత గ్యారెంటీలు ఎవరు నమ్మరని, కర్ణాటక రాష్ట్రంలోనే నమ్మి మోసపోయామని కర్ణాటక రైతులు చెబుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్‌ వస్పరి. శంకరయ్య, ఆలేరు బిఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షులు పుట్ట. మల్లేశం, కౌన్సిలర్‌ బేతి. రాములు, ముట కొండూరు వైస్‌ ఎంపీపీ, ఇల్లెందుల. మల్లేష్‌ గౌడ్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ పత్తి.వెంకటేష్‌, నాయకులు కర్ర. అశోక్‌, మజర్‌,రామకష్ణ ,రమేష్‌, నాగరాజు, రమణారెడ్డి , బీజీని .మధు, జూకంటి. వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.