తెలంగాణ కాంగ్రెస్‌ మీడియా సెల్‌ రాష్ట్ర జాయింట్‌ కోకన్వీనర్‌గా కప్పాటి శివరామకృష్ణ రెడ్డి

నవతెలంగాణ-కందుకూరు
తెలంగాణ కాంగ్రెస్‌ మీడియా సెల్‌ రాష్ట్ర జాయింట్‌ మీడియా కో కన్వీనర్‌గా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం బాచుపల్లి గ్రామా నికి చెందిన కప్పాటి శివరామకృష్ణారెడ్డిని శనివారం నియమితులయ్యారు. ఆలిండియా యూత్‌ కాంగ్రెస్‌ మీడియా సెల్‌ ఇన్‌చార్జి వరున్‌ పాండే ఆదేశాల మేరకు శనివారం ప్రదేశ్‌ యూత్‌ కాంగ్రెస్‌ మీడియా సెల్‌ అధ్య క్షులు సీఎచ్‌, శైలేంద్ర గాందీభవన్‌లో శివరామకృష్ణారెడ్డికి నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కప్పాటి శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తనను ప్రదేశ్‌ యూత్‌ కాంగ్రెస్‌ మీడియా సెల్‌ జెయింట్‌ కన్వీనర్‌గా నియ మించినందుకు ఆలిండియా యూత్‌ కాంగ్రెస్‌ మీడియా సెల్‌ ఇన్‌చార్జి వరుణ్‌ పాండే ప్రదేశ్‌ యూత్‌ కాంగ్రెస్‌ మీడియా సెల్‌ అధ్యక్షులు శైలేంద్రకు, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కార్గే, రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, యూత్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి అల్లువార్‌ శ్రీ క్రిష్ణ సురబి దివేది, సయ్యద్‌ ఖలీద్‌ హైమద్‌,రమేష్‌ బాబు ప్రదేశ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు శివసేన రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీనిచ్చారు.