సీఎం కేసీఆర్‌కు లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యం

నవతెలంగాణ- గజ్వేల్‌
ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు లక్ష మెజార్టీ తీసుకొస్తామని అదే లక్ష్యంతో పని చేస్తున్నామని గజ్వేల్‌ మండల మాజీ సర్పంచ్ల ఫోరమ్‌ అధ్యక్షులు నాగిరెడ్డి అన్నారు. శనివారం గజ్వేల్‌ లో ఏర్పాటు చేసిన గజ్వేల్‌ మండల మాజీ సర్పంచుల సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము గ్రామాల అభివద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంతో కషి చేసినట్లు ఆయన చెప్పారు. మాజీ సర్పంచులు ఐకమత్యంగా ఉండి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గెలుపుకు కషి చేస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా గజ్వేల్‌ మండలం అభివద్ధి జరుగుతుందంటే ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఉండడంతోనేనని ఆయన అన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలో గజ్వేల్‌ మండలాన్ని అభివద్ధి చేయాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివద్ధి సాధ్యమైంది అన్నారు. మంత్రి హరీష్‌ రావు ఆధ్వర్యంలో గజ్వేల్‌ మండలం అభివద్ధి తో ముందుకు వెళుతుందన్నారు. మాజీ సర్పంచులు బాలమణి . రాంరెడ్డి, కొమురయ్య , నర్సింలు, సత్యనారాయణ, దుర్గారెడ్డి , అశోక్‌ , శ్రీశైలం, మల్లికార్జున్‌, రాజా గౌడ్‌, రాజు , రాములు, పాల్గొని అన్ని గ్రామాలను అభివద్ధి చేసిన పార్టీకి భారీ మెజారిటీ కోసం పని చేస్తామని సమావేశం ఏర్పాటు చేశామన్నారు.