నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ శనివారం తోటపల్లి, గాంధీనగర్, మాలపల్లి, మడద, రాములపల్లి, పొట్లపల్లి, బంజెరుపల్లి, కూచనపల్లి, పందిళ్ల గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా చేపట్టారు. ప్రతి గ్రామంలో మహిళలు, ప్రజలందరూ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. ప్రతి గ్రామంలో ప్రజల నుంచి ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు బీఆర్‌ఎస్ శ్రేణులకు అపూర్వ స్పందన వచ్చింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ బీఆర్‌ఎస్ ఎన్నికల ఇంచార్జ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గంలో జరిగిన అభివద్ధిని చూడండి సతీష్ కుమార్ ను మరొకసారి ఆశీర్వదించండని అన్నారు. హుస్నాబాద్ ను రూ .9000 కోట్లతో అభివద్ధి చేశామని, నియోజకవర్గాన్ని అభివద్ధి రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలబెట్టామని, మరొకసారి ఎమ్మెల్యే గా సతీష్ కు అవకాశం ఇవ్వలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ కేసిఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అభివద్ధి, సంక్షేమ రంగాలలో దేశంలోనే నంబర్ స్థానంలో నిలబెట్టిందని అన్నారు. 24 గంటల కరెంట్, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణంలో నెంబర్ వన్ గా తెలంగాణ నిలిచిందన్నారు . పారిశ్రామిక రంగాలలో తెలంగాణకు పెట్టుబడులు పెట్టేందుకు వివిధ దేశాల కంపెనీలు వస్తున్నాయని ఇదంతా రాష్ట్రంలో అమలవుతున్న అభివద్ధి, సంక్షేమ పథకాల ఫలితమేనని, తలసరి ఆదాయంలో,విద్యా, వైద్య రంగాల్లో మన రాష్ట్రానికి సాటి దేశంలో ఏ రాష్ట్రం లేదన్నారు. 2023 బీఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రజారాజకంగా తయారు చేశామని మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలు కచ్చితంగా అమలు చేసి తీరుతామని, కేసిఆర్ మాట ఇస్తే తప్పడని ఇప్పటివరకు రెండుసార్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారని ,ఈ అభివద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగించాలంటే మూడోసారి అధికారాన్ని బి అర్ ఎస్ కు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో కేసీఆర్ ను ముఖ్యమంత్రిగా, హుస్నాబాద్ నియోజకవర్గం నుండి సతీష్ కుమార్ అనే నన్ను అతి భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు గంగ మదన్మోహన్ రెడ్డి, తోడేటి రమేష్, పోలవేణి లత, గీకురు రాజేశ్వరి వెంకటేశం, దుండ్రా భారతి జనార్ధన్, ఎంపీటీసీలు , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.