– బీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి
నవతెలంగాణ-మెదక్
కాంగ్రెస్‌కు ఓటేస్తే కష్టాల పాలవుతా మని, 11 సార్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏమి అభివద్ధి చేసిందో చెప్పాలని మెదక్ బీిఆర్‌ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాయన్ పల్లి, శివాయపల్లి, కొంటూర్ తదితర గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు ఏ పథకాన్ని ప్రవేశపెట్టాలన్న ఢిల్లీలో ఉన్న అధిష్టానం నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మనందరి నిర్ణయం మేరకే సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అసైన్ భూములు అమ్మకం, కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ నియోజకవర్గం ఓ ప్రయోగశాలగా మార్చిందని, పార్టీ సభ్యత్వం లేని వారికి టికెట్ ఇస్తుందని ఆరోపించారు. నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.ఇక్కడ స్థితిగతులు తెలియకుండా కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడుతున్నారని ఆరోపించారు. జెడ్పీ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, ఎంపీపీ జమున జయరాం రెడ్డి, హవెలిఘన్పూర్ మెదక్ మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, అంజా గౌడ్, కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు మాణిక్య రెడ్డి, కిష్టయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.