– కార్యకర్తల కషి ఫలితమే టికెట్ వచ్చింది
– కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి
నవ తెలంగాణ-నర్సాపూర్
వచ్చే ఎన్నికల్లో నర్సాపూర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆవుల రాజిరెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కషి ఫలితమే తనకు టికెట్ వచ్చిందన్నారు. కార్యకర్తల మేలు మరవలేనిదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలుపరచ లేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైపల్యాలే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయన్నారు. అయితే ఆవుల రాజిరెడ్డికి టికెట్ వచ్చినందున కాంగ్రెస్ శ్రేణులు ఆయన అభిమానులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.